Gang Leader - Ninu chuse anandamlo song lyrics || in telugu ||

 Ninu chuse anandamlo song lyrics in telugu||Nani||

              Song title: Ninu chuse anandamlo
Movie: Gang leader
Director: Vikram K kumar
Lyricist: Anantha sriram


Ninu chuse anandamlo song lyrics in telugu

కథ రాయడం మొదలు కాక ముందు
అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోక ముందు
అపుడే ఇదేమి తలపో
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా
మనసు తెలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు
అపుడే ఎలాంటి మలుపో

అణువణువునా ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే
మెదడుకి పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకు ఎరుగనిది ఏమిటిది
నిదరయినది నిదురకే
తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా
మనసు తెలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు
అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగా పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగా చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా
ఒకటొకటిగా తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరలా పెంచకని
అరిచెను ప్రతి కణమిలా
వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుబడదే
నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా
మనసు తెలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాక ముందు
అపుడే ఎలాంటి మలుపో


Comments