Saapatu Yetu Ledhu Song Lyrics in telugu
Saapatu Yetu Ledhu song Lyrics in telugu|Kamal Hasan|Sridevi
పాట | సాపాటు ఎటూ లేదు |
---|---|
చిత్రం | ఆకలి రాజ్యం(1981) |
గాయకులు: | S.P బాలసుబ్రహ్మణ్యం |
పాట రచయిత: | ఆచార్య ఆత్రేయ |
సంగీత దర్శకుడు: | ఎం.ఎస్ విశ్వనాథన్ |
దర్శకుడు: | కె బాలచందర్ |
నటులు: | కమల్ హాసన్, శ్రీదేవి |
Saapatu Yetu Ledhu song Lyrics in telugu
సాపాటు ఎటూ లేదు ,పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు ,పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్..
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్...
సాపాటు ఎటూ లేదు ,పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్....
మన తల్లి అన్నపూర్ణ , మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా.. తమ్ముడూ..
మన కీర్తి మంచు కొండరా...
మన తల్లి అన్నపూర్ణ ,మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా... తమ్ముడూ..
మన కీర్తి మంచు కొండరా...
డిగ్రీలు తెచ్చుకుని, చిప్ప చేత పుచ్చుకుని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్
సాపాటు ఎటూ లేదు ,పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్...
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్...
బంగారు పంట మనది ,మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా.. ఇంట్లో ఈగల్ని తోలుతామురా....
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
సాపాటు ఎటూ లేదు ,పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్....
సంతాన మూళికలం, సంసార భానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ..
సంపాదనొకటి బరువురా..ఓ
చదువెయ్య సీటు లేదు, చదివొస్తే పని లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్...
Comments
Post a Comment
Feel free to Ask Lyrics of Any Song, or give your valuable thoughts here