Kolu Kolu Lyrics In Telugu
Kolu Kolu Lyrics in Telugu|ViraataParvam|Raana Daggubati |Sai Pallavi
పాట | కోలు కోలు |
---|---|
సినిమా | విరాట పర్వం |
గాయకులు: | దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి |
పాట రచయిత: | చంద్రబోస్ |
సంగీత దర్శకుడు: | సురేష్ బొబ్బిలి |
దర్శకుడు: | వేణు ఉడుగుల |
నటులు: | రానా దగ్గుబాటి,సాయి పల్లవి,ప్రియమణి, |
Kolu Kolu song Lyrics in telugu
కోలు కోలో కోలోయమ్మ…
కొమ్మా చివరన పూలు పూసే, కోలో..
పువ్వులాంటి సిన్నదేమో…
మొగ్గయింది సిగ్గుతోటి కోలో...యమ్మ
కోలు కోలమ్మ కోలో కోలో.. నా సామి
మనసే మేలుకొని చూసే…
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే…
నూరేళ్ళు నిదుర రాదులే...
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే…
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే…
నూరేళ్ళు నిదుర రాదులే...
హే పిల్లగాడి మాటలన్ని…
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని…
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే…
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే…
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే…
నూరేళ్ళు నిదుర రాదులే...
పాదమేమో వాడిదంట…
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట…
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా…
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా..
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే…
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే…
నూరేళ్ళు నిదుర రాదులే....
This comment has been removed by the author.
ReplyDelete