Emaindhi Eevela Song Lyrics in Telugu
Emaindi Eevela Song lyrics in telugu |Venkatesh |Trisha|Aadavari Matalaku Ardhalu Veruley
పాట | ఏమైంది ఈ వేళ |
---|---|
సినిమా | ఆడవారి మాటలకు అర్థాలు వేరులే(2007) |
గాయకులు: | ఉదిత్ నారాయణ్ |
పాట రచయిత: | కుల శేఖర్ |
సంగీత దర్శకుడు: | యువన్ శంకర్ రాజ |
దర్శకుడు: | సెల్వరాఘవన్ |
నటులు: | వెంకటేష్, త్రిష |
కెన్ యూ ఫీల్ హర్?
ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్?
కెన్ యూ ఫీల్ ద లవ్?
యస్.
ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం
చినుకులలో వాన విల్లు
నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు
వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా
నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే
నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం
ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈ వేళ
ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల..
ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే
ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే
పెను మాయ చేసెనా
తన నడుము వొంపులోనే
నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే ఉరకలేసా
Comments
Post a Comment
Feel free to Ask Lyrics of Any Song, or give your valuable thoughts here